మండల టాపర్ గా ఏపీ మాడల్ పాఠశాల విద్యార్థి యశ్వంత్
1 min readయశ్వంత్ ను అభినందించిన మాజీ జడ్పిటిసి
తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలి
గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ సోమవారం రోజున విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఏపీ మాడల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.ఏపీ మాడల్ స్కూల్ విద్యార్థి గుంపుల యశ్వంత్ 577మార్కులతో పగిడ్యాల మండల టాపర్ గా నిలిచారని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సృజన తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన పగిడ్యాలలోని స్థానిక ఏపీ మాడల్ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ప్రిన్సిపల్ సృజన పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పగిడ్యాల మండలం లో మొదటి స్థానం గుంపుల యశ్వంత్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని భవిష్యత్తులో మరింత మెరుగైన విద్య అందించి విద్యార్థులను తీర్చిదిద్దడంలో మరింత కృషి చేస్తామన్నారు. అంతేగాక ఉపాధ్యాయులు మరియు స్కూల్ సిబ్బంది యశ్వంత్ అభినందించి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి జన్మనిచ్చిన తల్లి తండ్రులకు సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థిని ఆశీర్వదించారు. గుంపులు యశ్వంత్ ఏపీ మాడల్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తూ సెలవు రోజుల్లో తల్లి తండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ కష్టపడి చదివి 577 మార్కులు సాధించి మండలానికి తలమానికంగా నిలిచిన గుంపుల యశ్వంత్ ను గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, మాజీ జెడ్పిటిసి సభ్యుడు పుల్యాల నాగిరెడ్డి లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మాడల్ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.