PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అమీలియో’ లో… అరుదైన చికిత్స

1 min read

62 ఏళ్ల వృద్ధురాలికి…6 కేజీల కణితి తొలగింపు

  • 30 సెంటిమీటర్ల కణితిని తొలగించడంలో వైద్యులు సక్సెస్​
  • ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం…
  • గైనకాలజిస్ట్​ డాక్టర్​ కె. కావ్య వెల్లడి

కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని అమీలియో ఆస్పత్రి వైద్యులు అరుదైన చికిత్స చేశారు. 62 ఏళ్ల వృద్ధురాలు అండాశయం ఎడమ వైపున పెరిగిన 6 కేజీల కణితిని తొలగించి చరిత్ర సృష్టించారు. మంగళవారం ఆస్పత్రి ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రముఖ గైనకాలజిస్ట్​ డాక్టర్​ కె. కావ్య వివరాలు వెల్లడించారు. నగరంలోని చౌరస్తా సమీపంలోని జంపాల నగర్​లో  నివాసం ఉన్న పార్వతమ్మ (62) వృద్ధురాలి గత కొన్ని నెలలుగా తన నిత్యావసర పనులు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కూర్చున్నా.. నిలబడినా…నడిచినా…. కడుపులో నొప్పి ఉందని….తిన్న ఆహారం కూడా జీర్ణం కావడంలేదని  కుటుంబ సభ్యులకు చెబుతూ… ఇంటి దగ్గరే ఉంది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి పార్వతమ్మను తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్​ చేసిన వైద్యులు… అండాశయం ఎడమ వైపున కణితి ఉందని గుర్తించారు. దీంతో ఏమి చేయాలో తెలియక అమీలియో ఆస్పత్రికి ఏప్రిల్​ 24న తీసుకొచ్చారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు… అండాశయం ఎడమ వైపున 6 కేజీల బరువు, 30 సెంటిమీటర్లతో పెద్ద కణితి ఉందని గుర్తించారు. దీంతో వైఎస్సార్​ ఆరోగ్యశ్రీ కింద ఈ నెల 27వ తేదీన ఆపరేషన్​ చేసి… కణితిని తొలగించారు. దీంతో  బాధిత కుటుంబ సభ్యులు గైనకాలజిస్ట్​ డా. కె. కావ్య, డా. కె. శృతి, అనస్తియా వైద్యులు పి. శిల్పాకు కృతజ్ఞతలు తెలిపారు.

వైద్యులకు అభినందన…

అనంతరం అమీలియో ఆస్పత్రి ఎం.డి. లక్ష్మీ ప్రసాద్ చాపె ఆపరేషన్​ను విజయవంతం చేసిన గైనకాలజిస్ట్​ డా. కె. కావ్య, డా. కె. శృతి, అనస్తియా వైద్యులు పి. శిల్పాను అభినందించారు. అరుదైన వైద్య చికిత్సలను విజయవంతంగా పూర్తి చేయడంలో అమీలియో ఆస్పత్రి వైద్యులు ఎప్పుడూ ముందుంటారన్నారు. మున్ముందు ఇలాంటి కేసులను మరెన్నో చేయాలని ఈ సందర్భంగా ఆస్పత్రి ఎం.డి. లక్ష్మీ ప్రసాద్​ చాపె ఆకాంక్షించారు.

About Author