కులం పేరుతో సిబ్బందిని దూషించిన వార్డెన్ ను సస్పెండ్ చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్ యు ఎస్ ఫ్ ఆధ్వర్యంలోముఖ్య కార్యకర్తలసమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఆర్ యు ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వార్డెన్ అయినటువంటి హారతి దేవి తమ విధులకు హాజరు కాకుండా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే విషయంలో తరచూ సిబ్బందితో గొడవ బిల్లులు రాకపోయినా మీలాంటి వారికి కూడు పెట్టాలా విద్యార్థులతో మరియు సిబ్బందితో అసభ్య పదజాలం వాడుతూ కిందిస్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేయడంతో సిబ్బంది తీవ్రమైన మానసిక వేదనకు గురిగై తనను కులం పేరుతో దూషించడాన్ని దానిని సహించలేక వార్డెన్ హారతి దేవి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం జరిగింది అన్ని .విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వం లక్ష్యంగా ఉన్న దాన్ని నీరు కారుస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాము దీనిని ఆర్ యు ఎస్ ప్ విద్యార్థి సంఘం ఖండిస్తున్నాం అన్నితక్షణమే వార్డెన్ హారతి దేవి ని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు రవి, నవీన్, సతీష్, చందు ప్రభాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.