మత రాజకీయాలకు స్వస్తి పలకాలి..
1 min readటీడీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి టి.జి భరత్
– వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన బుధవారపేట యువకులు
కర్నూలు, పల్లెవెలుగు: మత రాజకీయాలు పక్కనపెట్టి కర్నూలు అభివృద్ధి కోసం అందరూ ఏకం అవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భరత్ అన్నారు. బుధవారపేటలోని అమీన్ బాషా దర్గా ప్రాంతానికి చెందిన వాజిద్, బాషా, ఇమ్రాన్, తదితరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టి.జి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాము 40 ఏళ్లుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు. కర్నూలు ప్రజల కష్టాలు తీర్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తాను రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎలాంటి విజన్ లేకుండా కేవలం కులం పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన కోరారు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఉచిత ఇసుక విధానం అమలవుతుందన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ రామాంజనేయులు, నరసింహులు, క్రాంతి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.