నేడు కాంగ్రెస్ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా జిలాని బాష నామినేషన్
1 min readకర్నూలు, పల్లెవెలుగు:కాంగ్రెస్ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా షేక్ జిలాని బాష గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అశేష ప్రజానీకం మధ్య భారీ ర్యాలీతో వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రం అందజేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు షేక్ జిలాని బాష తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధిష్ఠానం నిర్ణయం మేరకు తాను అధికారికంగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు. తన నామినేషన్ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఆయన కోరారు.