కర్నూలు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పిజి రాం పుల్లయ్య యాదవ్ నామినేషన్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లక్కీటు పీజీ రాం పుల్లయ్య యాదవ్ నామినేషన్ వేశారు. గురువారం ఉదయము జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే బాబురావు తో కలిసి నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి గారైన కలెక్టర్ కి సమర్పించారు. అలాగే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ జిలాని భాష నామినేషన్ వేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కే బాబురావుతో కలిసి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగారైన భార్గవ్ తేజ కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం డిసిసి అధ్యక్షులు బాబురావు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ అని, ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదని ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ హయంలో శాశ్వత పనులు చేపట్టడం జరిగిందని ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, కర్మాగారాలు, బ్యాంకుల జాతీయకరణ, మొదలగు శాశ్వత పనులు ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయని ప్రాంతీయ పార్టీల చేతగాని తనానికి ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు అని పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం కానీ వైసీపీ గానీ ఇంతవరకు పూర్తి కాలేదంటే వారి ప్రభుత్వాల అసమర్ద పాలనకు నిదర్శనమని విమర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి పీజీ రాం పుల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలలో మార్పు వచ్చిందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలియజేశారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలాని భాషా మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన తప్పిందని వైసీపీ పాలనలో కక్ష సాధింపులు, హత్యలు, ప్రశ్నించిన వారిపై దాడులు అధికమయ్యాయని వచ్చే ఎన్నికల్లో షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పీజీ నరసింహులు యాదవ్, పీజీ లోక్ నాథ్ యాదవ్, డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ వారి న్యాయవాదులు పాల్గొన్నారు.