టిడిపిలోకి సుంకేసుల మాజీ సర్పంచ్..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని సుంకేసుల గ్రామ వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి గారి రాంభూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.గురువారం సాయంత్రం 5:30 కు గ్రామంలో భూపాల్ రెడ్డి స్వగృహానికి వచ్చిన నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి సమక్షంలో భూపాల్ రెడ్డి తో పాటు 100 కుటుంబాలు టిడిపిలో చేరారు. పార్టీలో చేరిన వారిలో భూపాల్ రెడ్డితో పాటు పుట్టా వెంకట రమణయ్య,కుమ్మరి సుబ్బారావు,లేపాక్షి రెడ్డి, రామిరెడ్డి,శ్రీనివాసరెడ్డి,కురువ కుళాయి,బోయ నాయుడు, పెద్ద శ్రీనివాసులు,చిన్న శ్రీనివాసులు,కురువ బాబు, కుమార్,మాదిగ జక్కరయ్య, మాదిగ రాముడు,బాలు, స్వాములు,పూల రంగడు పార్టీలో చేరారు వీరందరికీ శివానందరెడ్డి మరియు నందికొట్కూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా శివానందరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయంగా కనిపిస్తుందని ప్రతి కార్యకర్త మన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేయాలని నీ పవిత్రమైన ఓటును వచ్చే నెల 13వ తేదీన ఓటు వేసి గెలిపించాలని శివానందరెడ్డి గిత్త జయసూర్య గ్రామంలో ఇంటింటికి వెళ్తూ ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కోరారు. అనంతరం భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు శివానందరెడ్డి,జయసూర్య లను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,చింతలపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.