PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిసి లు అంటే ఏమిటో చూపిస్తా

1 min read

బిసి లు ఓటు బ్యాంకు గానే ఉండాలా?

వాల్మీకులు గెలిస్తే రౌడీయిజం చేస్తారా?

ముడుదఫాలుగా జరగని అభివృద్ధిని చేసి చూపిస్తా

అట్టహాసంగా మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి నామినేషన్

భారిగా తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు

కూటమి నాయకులు, కార్యకర్తల తో కిక్కిరిసిన మంత్రాలయం

ముఖ్య అతిథులుగా హాజరైన టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి రెడ్డి, ఎమ్మెల్సీ బీటి నాయుడు, బిజెపి ఇన్చార్జ్ పురుషోత్తం రెడ్డి, జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ఈ ఎన్నికల్లో బిసి లు అంటే ఏమిటో సత్తా చూపిస్తామని మంత్రాలయం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం టిడిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ  బి.సి లు ఓటు బ్యాంకు గానే ఉండాలా? వాల్మీకుల ఓట్లతో గెలిచిన మీరు ఒక వాల్మీకి టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తే ఓర్వలేక టిడిపి అభ్యర్థి గెలిస్తే గ్రామాల్లో రౌడీయిజం మొదలౌతుందని విమర్శించడం బాలనాగిరెడ్డి మీకు తగునా అని ప్రశ్నించారు. అసలు బిసి లు లేకుండా బయటకు రాని మీరు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ముడుదఫాలుగా జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తానని తెలిపారు. అక్రమ ఇసుక మద్యం మట్కా వంటి అక్రమాలకు పాల్పడి మీరు మీ కుటుంబం ప్రతి మండలంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బాలనాగిరెడ్డి ని ఓడించి ఇంటికి పంపే సమయం 18 రోజులు మాత్రమే ఉందని టిడిపి బిజెపి జనసేన శ్రేణులు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ఎంపి అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు నాకు సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎమ్మేల్సీ బీటీ నాయుడు, బిజెపి ఇన్చార్జ్ పురుషోత్తం రెడ్డి, జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అబోడే హోటల్ నుండి రాఘవేంద్ర సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ అధికారి మురళి కి నామపత్రాలను సమర్పించారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్ లో భారీ గా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు మద్య క్రేన్ సహాయంతో భారీ గజ మాలతో స్వాగతం పలికారు.  నియోజకవర్గం లో బాలనాగిరెడ్డి ని ఓడించాలంటే మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు టిడిపి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇందుకు అందరూ సైనికులు గా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author