PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం 

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం:  శ్రీశైలంలో శ్రీ  పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో శుక్రవారంభ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు. సాంప్రదాయాన్ని అనుసరించి ఈ పూజలన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ముందుభాగంలో రజకునిచేత ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్వికబలి సమర్పించారు . ఈ సందర్బంగా అమ్మవారికి వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలను, నిమ్మకాయల సాత్విక బలిగా ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు భక్తులు సమర్పించారు. అయితే సాయంకాలం మల్లికార్జునస్వామికి మహా మంగళ హారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం స్వామిపై పడకుండా లింగరూపాన్ని పెరుగన్నం, ఉల్లిపాయలు, జీలకర్ర, శోంఠి భక్షాలతో కప్పివేశారు. అలాగే అమ్మవారికి ఆలయ ప్రకారం బయట ముఖమండపం ముందు అన్నం రాసిగా పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఘట్టం స్త్రీ వేషధారణలో స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతి సమర్పణ ప్రధానఘట్టం కుంభ హారతి అనంతరం మళ్ళీ రెండోవ విడత సాత్విక బలిగా కొబ్బరి, గుమ్మడికాయలు సమర్పించిన అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

About Author