సింగనమల యుద్ధానికి బిఎస్పి ‘సిద్ధం”
1 min read* బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి గౌతమి నామినేషన్ ఆమోదం
* పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కుందనపు కుటుంబం
* సింగనమల నియోజకవర్గం పేరుకే ఎస్సీ నియోజకవర్గం
* అధికారం చెలాయిస్తున్నది మాత్రం అగ్రవర్ణాలే
* ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నది ఎస్సీ లైన, పోటీ చేపిస్తున్నది మాత్రం రెడ్లు
* ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీలు ఏకమవ్వాలి, ఏనుగు గుర్తుకు ఓటేయాలి
పల్లెవెలుగు వెబ్ సింగనమల : బహుజన సమాజ్ పార్టీ సింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కుందనం గౌతమి నామినేషన్ పత్రాలు సెలెక్ట్ కావడం వల్ల మొదటి విజయం సాధించామని అభ్యర్థి గౌతమి అన్నారు. నా భర్త తరిమెల జై భీమ్ రామాంజనేయులు నన్ను వంటింటికే పరిమితం చేయకుండా గొప్ప సమానత్వంతో ఆలోచించి ప్రజా సమస్యలపై పోరాడాలని నన్ను ఏనుగు గుర్తుపైన పోటీ చేపిస్తున్నారు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మా వెన్నంటే ఉండి ఆహర్నిశలు కష్టపడుతున్న సింగనమల ఇన్చార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ కి, మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ గద్దల నాగభూషణం కి నన్ను బలపరిచిన G మహేష్ కి శ్రీరాములు కి. ధన్యవాదాలు తెలుపుతూ సింగనమల నియోజకవర్గం ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన ఆంధ్రప్రదేశ్లోనే సింగనమల నియోజవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి ఏనుగు సింగనమల నుంచి అసెంబ్లీకి వెళ్లాలని ప్రజల అందరిని వేడుకుంటున్నాను అన్నారు. సింగనమల నియోజకవర్గం పేరుకే ఎస్సీ నియోజకవర్గమైన ఇక్కడ అధికారం చాలా ఇస్తున్నది మాత్రం అగ్రవర్ణాల వారు. ఇక్కడ ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్నది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారైనా పోటీ చేపిస్తున్నది మాత్రం అగ్రవర్ణాలు అనేది బహుజన కులాల వారు మర్చిపోకూడదని వారు గుర్తు చేశారు. బహుజన రాజ్యాం కోసం బహుజన విజయం కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీలంతా ఏనుగు గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని కుందనపు గౌతమి కోరారు.