సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ
1 min readకర్నూల్ జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్
సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.
పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్ పరిధిలోని ఆర్. కొంతలపాడు, తొలిశాపురం సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.పోలీంగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి జిల్లా ఎస్పీ గారు ఆరా తీశారు . మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.జిల్లా ఎస్పీ గారితో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.