నేను డాక్టర్‌ను.. కబ్జాలు చేయను…
1 min readవైద్యం చేస్తా… అవకాశమిస్తే ప్రజా సేవ చేస్తా…
- ఆలోచించండి..ఓటు వేయండి…
- ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు:వృత్తిరీత్యా వైద్యం చేసే నేను… ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా…. భూ కబ్జాలు..దందాలు..చేయనని ఆదోని ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రం పెద్దలతో సత్సంబంధాలు ఉన్న తనను గెలిపిస్తే… ఆదోనిని అభివృద్ధిలో కర్నూలు జిల్లాలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతానన్నారు. శక్రవారం నియోజకవర్గంలోని చాగి, నారాయణపురం, ఢనాపురం, నాగనాతనహల్లి గ్రామాల్లో కూటమి నేతలు విస్తృత ప్రచారం చేశారు. పదైదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సాయి ప్రసాద్ రెడ్డికి మరో అవకాశమిస్తే…. భూ కబ్జాలు, మద్యం, ఇసుక, రేషన్ మాఫియా అభివృద్ధి చెందుతుందే తప్పా…. గ్రామాలు అభివృద్ధి చెందవన్నారు. గ్రామాల్లో రోడ్లు లేవు.. నీటి సౌకర్యం లేదు.. వీధిలైట్లు లేకపోగా…. రైతుల పొలాలు కబ్జాలకు గురవుతున్నాయని, ఇది ఎంతో బాధాకరమన్నారు. కేంద్రం నిధులతో రైతు భరోసా కేంద్రాలు నిర్మించారని కానీ అక్కడ రైతులకు మేలు జరగడంలేదన్నారు. నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి… ఓటు వేయాలని, తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని గ్రామాల్లో తిష్ట వేసిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి డా. పార్థసారధి హామీ ఇచ్చారు. ఆదోని అభివృద్ధి చెందాలంటే… కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ జైన్, జనసేన నాయకులు మల్లప్ప , సీనియర్ నాయకులు ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.