PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జి.పుల్లయ్య కాలేజీకి ఇస్రో శాస్త్రవేత్త

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  స్థానిక వెంకయపల్లిలోని  జీ. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్రో శాస్త్రవేత్త డా. జయేంద్ర బుసిరెడ్డి తో ముఖాముఖి కార్యక్రమం జరిగినది. సిఎఐ డిపార్ట్మెంట్ విద్యార్థులతో జయేంద్ర బుసిరెడ్డి తన అనుభవాలని, విజ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. ఇస్రోలో రాణించాలంటే కావాల్సిన స్కిల్స్ ని వివరించారు. అదేవిధంగా చంద్రయాన్ 3 కోసం ఇస్రో పాటుపడిన అనుభవాలని విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలోడా. సి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలు దేశానికి గర్వకారణం అని మన దేశ అభివృద్ధిలో ఇస్రో శాస్త్రవేత్తల ది సింహభాగమని ఇలాగే విద్యార్థులు కూడా ఇస్రోలో శాస్త్రవేత్తలుగా చోటు దక్కించుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తర్వాత కి స్పీకర్ జయేంద్ర బుసిరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ఇస్రోలో శాస్త్రవేత్త గా మీరు మిమ్మల్ని చూసుకోవాలంటే ఈరోజు నుంచి పరిశోధనల వైపు అడుగులు వేయాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమం డా. ఎస్. సుమన్ ప్రకాష్, విభాగాధిపతి సిఏఐ ఆధ్వర్యంలో జరిగినది.  ఈ కార్యక్రమంలో డీన్ అడ్మిన్ డా. ఎం.గిరిధర్ కుమార్, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author