ఘనంగా ఏఐఎన్‌యూ ఐదో వార్షికోత్సవం
1 min read* ఇప్పటివరకు 7వేలకు పైగా శస్త్రచికిత్సలు
* 12 వేల మందికి పైగా డయాలసిస్ సేవలు
* ఉత్తరాంధ్ర వాసుల కిడ్నీ సమస్యలకు సమగ్ర పరిష్కారాలు
* వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు
* రూ.999కే ప్రత్యేక కిడ్నీ స్టోన్ పరీక్షల ప్యాకేజి
పల్లెవెలుగు వెబ్ విశాఖపట్నం : ఉత్తరాంధ్ర వాసుల కిడ్నీ సమస్యలకు సమగ్ర పరిష్కారాలు అందించే ప్రధాన లక్ష్యంతో ఏర్పాటైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి తన ఐదో వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించుకుంది. ఆస్పత్రిలోని పలు విభాగాలకు చెందిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందరూ ఇందులో పాల్గొన్నారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మొత్తం 77 మంది సిబ్బంది, వైద్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ జి.రవీంద్రవర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ అమిత్ సాప్లే, కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ పి.శ్రీధర్, ఎనస్థీషియాలజిస్టు డాక్టర్ శ్యాం పేరి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఉదయ్ దీపక్‌రావు గజారే తదితరులు మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ ఆస్పత్రిలో ఈ ఐదేళ్లలో 13 మందికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు, 7వేలకు పైగా ఇతర శస్త్రచికిత్సలు, 12 వేలకు పైగా డయాలసిస్ సేవలు, 2,500కు పైగా ఎమర్జెన్సీ సేవలు, 60 వేలకు పైగా ఓపీడీ సేవలు, 8,500కు పైగా ఐపీ సేవలు అందించినట్లు వివరించారు. అలాగే ఓపీ, ఐపీ, ఇన్వెస్టిగేషన్లు, డయాలసిస్, శస్త్రచికిత్సలు, బయటి క్యాంపులు.. ఇవన్నీ కలిపి ఇప్పటివరకు ఈ ఐదేళ్లలో 2.15 లక్షల మంది రోగులకు సేవలు అందించినట్లు తెలిపారు. 50 పడకల సామర్థ్యం ఉన్న ఏఐఎన్‌యూ ఆస్పత్రిలో రోజుకు 24 గంటల్లో ఏ సమయంలోనైనా అత్యవసర పరిస్థితి వస్తే సమగ్ర చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇక్కడ ఆరు అత్యాధునిక డయాలసిస్ యూనిట్లు, అన్ని సౌకర్యాలతో కూడిన మూడు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధులతో బాధ పడుతున్న రోగుల పాలిట ఈ ఆస్పత్రి ఒక ఆశా దీపంలా నిలిచింది.
ప్రత్యేక కిడ్నీ స్టోన్ ప్యాకేజి
ఐదో వార్షికోత్సవం సందర్భంగా ఏఐఎన్‌యూ ఆస్పత్రిలో కిడ్నీలో రాళ్ల పరీక్ష కోసం ఒక ప్రత్యేక ప్యాకేజి ప్రకటించారు. ఇందులో భాగంగా సీబీసీ, సీయూఈ, యూఎస్‌జీ (కేయూబీ), సీరం క్రియాటినైన్, సీరం యూరిక్ యాసిడ్, ఈజీఎఫ్ఆర్ వంటి పరీక్షలతో పాటు యూరాలజిస్టు, అవసరమైతే నెఫ్రాలజిస్టు కన్సల్టేషన్ కూడా ఉంటుంది. వీటన్నింటికీ కలిపి కేవలం రూ.999/- మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. సాధారణంగా అయితే ఈ పరీక్షలన్నింటితో పాటు వైద్యుల కన్సల్టేషన్‌కు కలిపి రూ.4,300/- అవుతుంది. అయితే వార్షికోత్సవ ప్యాకేజిలో భాగంగా కేవలం 999 రూపాయలకే ఈ సేవలన్నింటినీ అందిస్తున్నారు.