ప్రచారంలో ఫ్యాను జోరు..!
1 min readవైఎస్ఆర్ సిపితోనే పేదల జీవితాలలో వెలుగులు.
జగన్ తోనే సంక్షేమ రాజ్యం సాధ్యం.
జగనన్న ను గెలిపించుకుంటేనే భవిష్యత్..
జగన్ పాలనలో జరిగిన మేలును వివరిస్తూ ఎన్నికల ప్రచారం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: వైఎస్ఆర్ సిపితోనే పేదల జీవితాలలో వెలుగులు నిండుతాయని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డా.ధారా సుధీర్ కు మద్దతుగా పట్టణంలోని 20, 28 వ వార్డు లలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జన సందోహం మధ్య పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల ఆత్మీయ, ఆదరాభిమానాల మధ్య ముమ్మరంగా ప్రచారం కొనసాగింది.జగన్ పాలనలో జరిగిన మేలును ఇంటింటా వివరిస్తూ, ప్రజారంజక పాలన కోసం మరలా వైఎస్ఆర్ సిపి ని ఆదరించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ జగన్ తోనే సంక్షేమ రాజ్యం సాధ్యమన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ నెరవేర్చారన్నారు. జగనన్న ను గెలిపించుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు .ధర్మయుద్దం చేస్తున్న సీఎం జగన్ కు అండగా నిలవాలని, అధర్మ కూటమికి బుద్ది చెప్పాలన్నారు.వైఎస్ఆర్ సిపి పాలనకు, గత టి డి పి పాలనకు ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. కూటమి పార్టీలకు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు.రూ 2.70 లక్షల కోట్ల నిధులును వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందించి పేదల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్ చేయూతనందించారన్నారు.ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయ్యాలని అభ్యర్థించారు.మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, ఉపాధ్యక్షులు చింతా విజ్జి, జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సుకుర్ మియ్య, కౌన్సిలర్ షేక్ అబ్దుల్ హమీద్, జె.రాధిక, తాహీర్ అహ్మద్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి రంగారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ బొల్లెద్దుల రామక్రిష్ణ, కౌన్సిలర్ లు కాటెపోగు చిన్నరాజు, చాంద్ భాష, అబ్దుల్ రవూఫ్, చెరుకు సురేష్, అల్లురి క్రిష్ణ, రజిని కుమార్ రెడ్డి, మనపాడు అశోక్, వి.ఆర్ శ్రీను, బోయ శేఖర్, సన అబ్దుల్లా, దేశెట్టి శ్రీనివాసులు, షేక్ నాయబ్, శాలి ఫైల్వాన్, సప్లయర్ సత్యనారాయణ, రైతు సంఘం బాబు, గోవింద రెడ్డి, బి.అబ్దుల్లా, సెంట్రింగ్ వలి,కురువ శ్రీను, బొట్టు రవి, ఆశాం, బరగొడ్ల బాబు, ఉస్మాన్, జగన్ రఫీ, గపూర్,వెంకట స్వామి, బద్రి, అనీల్ సప్లయర్ అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.