PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

30 హమాలి కుటుంబాలు వైఎస్ఆర్సిపిలో చేరిక 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణంలో 30  హమాలీల కుటుంబాలు వైయస్సార్సీపీలో చేరారు . సోమవారం   పత్తికొండలోని వైయస్సార్ వైఎస్ఆర్సిపి కార్యాలయంలో పార్టీ సోషల్ మీడియా యాక్టివ్ మెంబర్లు దామోదర్ రెడ్డి, సంజీవరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కి చెందిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో హమాలీలు మేస్త్రి తిరుపాలతో పాటు 30 మంది హమాలీలు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రవేశపెట్టిన జనరంజకమైన పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కంగాటి శ్రీదేవమ్మను అత్యధిక మెజారిటీ తో గెలిపించుకునేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author