అబద్ధపు హామీలతో టిడిపి అధికారంలో రావాలని చూస్తుంది..
1 min readపాణ్యం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : అబద్ధపు హామీలతో టిడిపి అధికారంలో రావాలని చూస్తుందని మోసపు హామీలను నమ్మవద్దని పాణ్యం దీస్i వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు మంగళవారం నాడు గడివేముల మండలం పరిధిలోని దుర్వేసి. కొరటమది పెసర వాయి . కరిమద్దెల గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారని నియోజకవర్గంలో ఎంత మాత్రం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని అభివృద్ధి నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండో పవర్ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాని ప్రాజెక్టు మొదలైతే స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని గ్రామాలలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని దళారి వ్యవస్థ లేకుండా ప్రభుత్వం అందించిన పథకాలు ప్రతి కుటుంబంలో సంతోషం నింపిందని పుట్టిన పిల్లవాడి నుండి వృద్ధుల వరకు లబ్ధి పొందారని ఇంతకంటే సంక్షేమాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదని మళ్లీ జగనన్న సీఎం చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు రైతు రుణమాఫీ .ఇన్పుట్ సబ్సిడీ. అమ్మ ఒడి. విద్యా దీవెన. వైయస్సార్ చేయూత. వైసీపీ ప్రభుత్వ హయాంలో పథకాలు అమలు చేసామన్నారు పెసరవాయిలో రైతులకు నేటి ఇబ్బందు లేకుండా తాగునీరు ఇప్పించిన ఘనత తనదే అన్నారు అర్ధరాత్రి రైతులు ఫోన్ చేసిన నేటిపారుల శాఖ అధికారులతో కేసికి చివరి ఆయకట్టు వరకు నీరు విడుదల చేపించిన ఘనత తనదే అని ఎస్సార్ బీసీ తూము ద్వారా మద్దిలేరు వాగుకు నీరు విడుదల చేసేలా చొరవ తీసుకున్న ఘనత సమాధానం అన్నారు వైసిపి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు వేయాలన్నారు తనను గెలిపిస్తే ఈసారి నియోజకవర్గానికి మరెన్నో పరిశ్రమలు తీసుకొని వస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు ఎల్లారెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. మంచాల నిరంజన్ రెడ్డి. రాజారెడ్డి. జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. మండల వైసీపీ అధ్యక్షుడు శివరాంరెడ్డి. గని వైస్ సర్పంచ్ ఆనంద్ రెడ్డి . మేఘనాథ్ రెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి. సొసైటీ చైర్మన్. చంద్రశేఖర్ రెడ్డి. బాల చెన్ని. ఎంపీటీసీ మహేశ్వర్ రెడ్డి. రఘు మాధవరెడ్డి. మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.