కర్నూల్ నగరంలో… విద్యుత్ షార్ట్ సర్క్యూట్
1 min readప్రమాద స్థలాన్ని సందర్శించిన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ నందు సోమవారం నాడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి దెబ్బతిన్న డ్రెస్ సర్కిల్ రేమాండ్స్ షోరూం ప్రాంతాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఈరోజు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగాప్రమాద సంఘటన జరిగిన తీరును, జరిగిన నష్టాన్ని ఆయన షోరూం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో అగ్నిమాపక సిబ్బంది రావడం వలన పెను ప్రమాదం తప్పిందని, లేదంటే భారీ నష్టం జరిగి ఉండేదని షాపుల నిర్వాహకులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కు తెలిపారు. అగ్ని ప్రమాదాన్ని సకాలంలో గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి వెంటనే సమాచారం ఇవ్వడం చాలా మంచిది అయిందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. లేకపోతే ప్రమాదంలో ఆస్తి నష్టంతోపాటు షో రూమ్లలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఎంతగానో ఇబ్బంది పడాల్సి వచ్చేదని టీజీ వెంకటేశ్ అన్నారు .ఏది ఏమైనా నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రమాదాలు తలెత్తకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రెస్ సర్కిల్ రేమండ్స్ షోరూమ్ ల అధినేతలు గోపాల్ రెడ్డి వరుణ్ తదితరులు పాల్గొన్నారు.