పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది ముమ్మాటికి జగనే
1 min readజనసేన అధినేత పవన్ కళ్యాణ్
పోలవరం ప్రాజెక్ట్ కు పూర్తిస్థాయిలో నా వంతు కృషి చేస్తా
ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్
వారాహి విజయ యాత్రకు వేలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కొయ్యలగూడెం వారాహి విజయ యాత్ర సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ముమ్మాటికి ఆపింది జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతా ప్రజల కష్టాలు తెలిసిన వాడినని, పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటానని, పోలవరం జిల్లా ఏర్పాటుపై చర్చిస్తానని ప్రజలకు పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉమ్మడి మేనిఫస్ట్ పై అన్ని వర్గాల వారు సంతృప్తి చెందారన్నారు. యువతకు ఉద్యోగాల శ్రేయస్సు మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జగన్ కు ఓటేసి గెలిపిస్తే మనకు వారసత్వంగా వచ్చే భూములు ఉండవని, పాస్ పుస్తకాల పైన సరిహద్దు రాళ్లపైన జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. మన ఆస్తుల ఒరిజినల్స్ వారి వద్ద ఉంటాయట. మన ఆడపిల్లల ఆస్తి పత్రాల కింద జిరాక్స్లు ఇవ్వాలట. ఈ జిరాక్స్ పత్రాలతో ఏ బ్యాంకు వారైనా మనకు అప్పు ఇస్తాడా అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికె జగన్ని ఐదేళ్లు భరించామని రాబోయే కాలంలో ఇక భరించలేమని మీరంతా కుటమి అభ్యర్థుల గుర్తుల పై ఓటు వేసి కుటమి అభ్యర్థులను గెలిపించి విజయాన్ని చేకూర్చాలన్నారు. వారాహిపై నుండి చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ను. పోలవరం ఎమ్మెల్యే అభ్యర్థి బాలరాజు ను పరిచయం చేశారు. ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కృషి చేస్తానని పుట్టామహేష్ హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్. అసెంబ్లీలో గళం విప్పుతానని అశేష జనవాహిని ముందు ఎంపీ అభ్యర్థి మహేష్ కుమార్ హామీ ఇచ్చారు. మాజీ డిసిసిబి చైర్మన్ కరాటం రాంబాబు మరియు వేలాదిగా తరలివచ్చిన కూటమి అభ్యర్థులు మహిళలు పాల్గొన్నారు.