సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: పాణ్యం మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో 138వ మే డే వేడుకల లో భాగంగా ఘనంగా జరిగాయి నంద్యాల సిఐటియు. జిల్లా కార్యదర్శి ఏ నాగరాజు పాణ్యం గ్రామపంచాయతీ ఆఫీస్ హమాలి యూనియన్ ఆఫీస్ దగ్గర జెండా ఎగరేసి అనంతరం ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో స్టార్ట్ నందు సిఐటియు జెండా ఎగరేసి అనంతరం 50 మంది ఆటో కార్మికులకు యూనిఫామ్ పంచడం జరిగినది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి 40 కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా విభజించి యజమానులకు బానిసలుగా మార్చి చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చినది కార్మిక చట్టాలపై కార్మికుల కార్మికులంతా ఐక్యంగా పోరాడి హక్కులను కాపాడుకోవాలని కోరారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రమేష్ నాయక్ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి నాగరాజు. విద్యార్థి సంఘం నాయకులు ప్రతా ప్. వెంకటాద్రి. ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకట్ తిరుమలేశు తిక్కన్న లక్ష్మన్న బాబు హుస్సేన్ నాగరాజు బాబు మాబు గ్రామపంచాయతీ వర్కర్లు. శ్రీరాములు వెంకటసుబ్బయ్య ఆటో వర్కర్లు అమాలి వర్కర్లు ప్రజానాట్యమండలి పాల్గొన్నారు.