పాణ్యం లో ఎగిరేది… వైకాపా జెండానే..!
1 min read95 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మాదే.పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: నిత్యం ప్రజల్లో ఉండే నాయకులకు ఓటు అడిగే అర్హత ఉందని, కేవలం ప్రజలంటే ఓటర్లుగా భావించి ఎన్నికల సమయంలో మాత్రమే మీ వద్దకు వచ్చే నాయకులను నమ్మకండి అని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన గడివేముల మండలంలోని బూజునూరు, గ్రంధి వేముల చిందుకూరు, తిరుపాడు, కొరట మద్ది గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసిపి నాయకులు అభిమానులు ఎమ్మెల్యేకు గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్ళుగా గత ఐదు సంవత్సరాలు పాలనందించారన్నారు. గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన 95 శాతం హామీలను నెరవేర్చిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. నవరత్నాల అమలుతోపాటు ప్రతి ఇంటికి నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలే దన్నారు. వాలంటరీ,సచివాల వ్యవస్థలను తీసుకువచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా వారిని పెట్టి ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకున్న నిజమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించామని, పాణ్యం నియోజకవర్గంలో తన పరిధిలో ఉన్నంతవరకు పూర్తి స్థాయిలో ప్రజలకు అండగా నిలబడడం జరిగిందన్నారు. ఒకటో తేదీ పింఛన్ ఇంటి వద్దకు రావాలన్న, సంక్షేమ పథకాలు మీ గడప వద్దకు చేరాలన్న, వాలంటరీ సచివాలయ వ్యవస్థల సేవలు మీకు చేరాలన్న మళ్లీ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తే అవి సాధ్యపడతాయని లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవస్థను సర్వనాశనం చేస్తారన్నారు. గతంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పాణ్యం నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేసిందని, ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. చుట్టపు చూపుగా వచ్చే నాయకులను ప్రజలు నమ్మకూడదని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటిని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. బూజునూరు గ్రామంలో ఎస్ఆర్బిసి కాలువపై ఎలక్షన్ తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేపడతామని, జిందాల్ యాజమాన్యంతో మాట్లాడి సిఎస్ఆర్ నిధుల కింద గ్రామాల అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి ఎంపీపీ నాగమద్దమ్మ, మండల వైసీపీ అధ్యక్షుడు శివరామిరెడ్డి, వైసిపి నాయకులు రఘు మాధవరెడ్డి, చిందుకూరు వెంకటకృష్ణారెడ్డి, గని ఆనంద రెడ్డి, మేఘనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి పుల్లయ్య, ఢాలుస్వామి, దుర్వేసి కృష్ణారెడ్డి, కొరటమద్ది సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బాల చెన్ని తదితరులు పాల్గొన్నారు.