భారీగా మద్యం స్వాధీనం..
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: నంద్యాల గిద్దలూరు రహదారిలో గాజుల పల్లె అంతర్ జిల్లా చెక్పోస్ట్ వద్దా భారీగా మద్యాన్ని శుక్రవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు . రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక వాహనంలో రెండువేల మద్యం కేసులు పైనే స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. నంద్యాల వైపు నుండి గిద్దలూరు పోవుచుండగా గాజులపల్లె చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించగా మద్యం అక్రమ రవాణా బండారం బట్టబయలైంది. ఇప్పటికే అక్కడ డి.ఎస్.పి రవీంద్రనాథ్ రెడ్డి సీఐ శివకుమార్ రెడ్డి ఎస్బిసిఐలు వెంకటేశ్వరరావు సూర్య మౌళి ఎస్ఇబి అధికారులు ఘటన స్థలంలో మద్యాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారికి సమాచారం అందజేశారు.