రానున్న జగన్ ప్రభుత్వంలో వాలంటరీలకు మంచి భవిష్యత్తు ఉంది
1 min readఏలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని
14 డివిజన్లు చెందిన వాలంటరీలు కార్పొరేటర్ అనూష తేజ సమక్షంలో స్వచ్ఛందంగా రాజీనామా
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దేశంలో గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సాధ్యమైందని, ఇంటికే సంక్షేమం సచివాలయలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు అందించి, వాలంటీర్లు దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందారని, రానున్న జగనన్న ప్రభుత్వం వాలంటీర్లకు మంచి భవిష్యత్ ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్వచ్చందంగా రాజీనామా చేసిన వాలంటీర్లకు భరోసా ఇచ్చారు. శనివారం 14 డివిజన్ కు చెందిన 7 మంది వాలంటీర్లు స్వచ్చందంగా రాజీనామా చేసి ఎమ్. ఎల్. ఏ. క్యాంప్ కార్యాలయం లో ఆళ్ల నానిని మర్యాద పూర్వకంగా కలిసి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆళ్ల నానికి మద్దతూ పలికారు. ఈ సందర్బంగా ఆళ్ల నాని మాట్లాడుతూ రాజీనామా సాహస నిర్ణయాన్ని అభినందించారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ దారపు అనూష తేజ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గేదెల సూర్య ప్రకాశరావు, జీ. పూర్ణ చంద్రరావు, డిప్యూటీ మేయర్లు నూకపోయే సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.