నాగలూటిలో టిడిపి ఇంటింటా ప్రచారం..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో గ్రామ టిడిపి నాయకులు సంపంగి రవీంద్రబాబు,రమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈనెల 13న జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లను సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అదే విధంగా ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య,నంద్యాల ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రజలకు వారు కరపత్రాలను పంచారు.టిడిపి ప్రకటించిన సూపర్ సెక్స్ మేనిఫెస్టో పథకాలను వారు ప్రజలకు వివరించారు.అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని మీరు ఆలోచించి ఓటు వేయాలని వారు ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు డి.చిన్న బాబు సాహెబ్,టి రంగారెడ్డి,టి.రమణా రెడ్డి, కృష్ణ,జమ్ములయ్య,శివ,వడ్డే రాధాకృష్ణ,న్యామతుల్లా, కట్టప్ప తదితరులు పాల్గొన్నారు.