PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగనూరు నియోజవర్గాన్ని  ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

1 min read

ఎమ్మెల్యే అభ్యర్థి రేణుక వెల్లడి

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో పెద్ద పార్క్ నుండి వైయస్సార్ సర్కిల్, సోమప్ప సర్కిల్, గాంధీ సర్కిల్ , షరాఫ్ బజార్, నీలకంటేశ్వర స్వామి టెంపుల్, సోమేశ్వర టాకీస్, శ్రీనివాస్ టాకీస్,ఇంద్రానగర్,కూరగాయల మార్కెట్, శివ టాకీస్ సర్కిల్ మీదుగా భారీ జనసంద్రం లా సాగిన  రోడ్డు షోప్రజలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అభ్యర్థిస్తూ సాగిన రోడ్ షో.ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గం గా తీర్చిదిద్దుతానని, వ్యాపారస్తులకు, రైతులకు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, ఎక్కడ అవినీతి తావు లేకుండా  చేస్తానని, పట్టణంలో నీటి ఎద్దటి లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తానని, చేనేతలకు అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని, ఎలక్షన్ ముందు మాత్రమే చంద్రబాబు కి చేనేతల గుర్తొస్తారు, కనీసం చంద్రబాబు మేనిఫెస్టో లో కూడా చేనేతల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు, ఓట్టి మాటలతోనే టెక్స్ టైల్స్ పార్క్ నిర్మిస్తా చేనేతలను ఆదుకుంటా అని కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని, ఆమె అన్నారు.దారి పొడవునా జనాలకు అభివాదం తెలుపుతూ, షాప్ షాప్ తిరుగుతూ మా అమ్మకి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వేయించాలని అభ్యర్థించిన బుట్టా ప్రతుల్ , అత్త కోసం కోడలు జనాలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మా అత్త నీ భారీ మెజార్టీతో గెలిపించాలని బుట్టా సాహితి  అభ్యర్థించారు.సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర లింగాయత్ కార్పోరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్, మండల అధ్యక్షుడు బి.ఆర్ బసిరెడ్డి రెడ్డి వీరు మాట్లాడుతూ  చెన్నకేశవరెడ్డి  బలపరిచిన మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టారేణుకకి, కర్నూల్ ఎంపీ బివై రామయ్యకి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఎంపీ అభ్యర్థిని బి వై రామయ్య  మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీమతి బుట్టా రేణుక కి ,నాకు, రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ ,వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

About Author