PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంద‌రం క‌లిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం.. క‌ర్నూలు టిడిపి అభ్యర్థి టి.జి భ‌ర‌త్

1 min read

వైసీపీని వీడి టిడిపిలో చేరిన 14వ వార్డు యువ‌కులు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంద‌రం క‌లిసిక‌ట్టుగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుందామ‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. తెలుగుయువ‌త న‌గ‌ర అధ్యక్షుడు శివ‌ప్రసాద్ ఆద్వర్యంలో 14వ వార్డు వైసీపీకి చెందిన షేక్ బాబు, తెలుగుచందు, షేక్ అబేద్, షేక్ అక్బర్, మాలిక్, షేక్షాతో పాటు యువ‌కులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ఈ 5 సంవ‌త్సరాల్లో రాష్ట్రం అల్లక‌ల్లోలం అయ్యింద‌న్నారు. అన్ని వ‌ర్గాలు న‌ష్ట‌పోయాయ‌ని, ప‌న్నులు, విద్యుత్ చార్జీలు, నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగి ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని వివ‌రించారు. వైసీపీ పాల‌న చూసిన ప్రజ‌లు ఇప్పటికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌న్నారు. రానున్న ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు సిద్ధమ‌య్యార‌ని పేర్కొన్నారు. ఇక క‌ర్నూల్లో త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజ‌ల స‌మ‌స్యల‌న్నీ తీర్చి న‌గ‌రాన్ని అభివృద్ధి చేస్తాన‌ని చెప్పారు. న‌గ‌రంలో నిరుద్యోగం పెరిగిపోయింద‌న్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ప‌రిశ్రమ‌లు తీసుకువ‌చ్చి యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇస్తున్నట్లు చెప్పారు. గౌండా, ఎల‌క్ట్రిసిటీ, ప్లంబ‌ర్ కార్మికుల‌కు నిత్యం ప‌ని దొరికేలా నిర్ణయాలు తీసుకుంటామ‌న్నారు. ప్రజాసేవ చేసేందుకు రాజ‌కీయాల్లో ఉన్న త‌న‌ను ప్రజ‌లంద‌రూ దీవించి ఎమ్మెల్యే చేయాల‌ని కోరారు. త‌న‌కు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇస్తే ప‌నితీరు ఏంటో చేసి చూపిస్తాన‌ని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హ‌క్కు వినియోగించుకోవాల‌ని ఆయ‌న కోరారు.  ఈ కార్యక్రమంలో తెలుగుయువ‌త పార్లమెంట్ అద్యక్షుడు అబ్బాస్, టిడిపి నాయ‌కులు తెలుగు మ‌హేష్‌, ర‌ఘునాథ్ సింగ్, విజ‌య‌ల‌క్ష్మి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author