ఎన్నికల్లో అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరైనా సరే అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని మిడుతూరు ఎస్ఐ ఎం జగన్ మోహన్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట, జలకనూరు గ్రామాల్లో అధికారుల ఆదేశాల మేరకు సాయంత్రం ఆయా గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అంతే కాకుండా గ్రామాల్లో గొడవ జరుగుతున్న సమయంలో మీరు ఆ గొడవ దగ్గరికి చూడడానికి వెళ్తే ఆ గొడవ వీడియోలో మీరు కనబడితే మీ పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తప్పు చేసిన వారు తప్పించుకుపోతారని తప్పు చేయని వారే వీడియోలో ఉన్నందున కేసుల్లో ఇరుక్కుపోతారని కావున మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సిబ్బంది రేణు ప్రసాద్,శ్రీనివాసులు మరియు ఆర్ముడు రిజర్వుడు ఫోర్స్ పాల్గొన్నారు.