దళిత జనబాంధవుడు దామోదరం సంజీవయ్య
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దళిత జనబాంధవుడు దామోదరం సంజీవయ్య ని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు అభిప్రాయపడ్డారు. శ్రీ దామోదరం సంజీవయ్య నలుగురు ప్రధానమంత్రుల క్యాబినెట్లో మంత్రిగాను, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గాను, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవులు అలంకరించారని ఆయన ఎలాంటి ఆస్తులు సంపాదించలేదని అలాంటి మహోన్నత వ్యక్తి మన కర్నూలు జిల్లాలో జన్మించడం మనకు ఎంతో గర్వకారణమని రాష్ట్రంలో పరిపాలన ప్రాంతీయ పార్టీలతో చేతగావడం లేదని రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి పాలన గాడి తప్పిందని సంక్షేమ పథకాలు ప్రచారానికే పరిమితం అయ్యాయని వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయిందని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని వైసిపి, టిడిపి ఒక తాను ముక్కలని ఏ పార్టీని గెలిపించిన కేంద్రంలో మతతత్వ పార్టీ అయిన బిజెపికి మద్దతు ప్రకటిస్తాయని కనుక అన్ని మతాలను కులాలను సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని బాబురావు కోరారు. ముందుగా శ్రీ దామోదరం సంజీవయ్య 52 వ వర్ధంతి సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో దామోదరం సంజీవయ్య చిత్ర పటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే కోడుమూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి మురళీకృష్ణ, కర్నూలు అభ్యర్థి షేక్ జిలాని భాష, పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, డిసిసి గౌరవాధ్యక్షులు ఉండవల్లి వెంకటయ్య, డిసిసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అనంతరత్నం, డిసిసి ఉపాధ్యక్షులు బి బతుకన్న, డిసిసి ప్రధాన కార్యదర్శులు సయ్యద్ నవీద్, ఎన్ చంద్రశేఖర్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ ఎండ్లూరి లాజరస్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల, సాంస్కృతిక విభాగం జిల్లా చైర్మన్ నాగశేషులు, జిల్లా సోషల్ మీడియా చైర్మన్ అమన్, రాష్ట్ర కాంగ్రెస్ ఓబిసి ప్రధాన కార్యదర్శి వెంకట రాముడు, డిసిసి కార్యదర్శులు ఎజాస్ అహ్మద్, అబ్దుల్ హై, జోజి సదానందం, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాద్రి పాషా, సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లలిత, కాంగ్రెస్ నాయకులు జి వెంకటస్వామి బజారన్న షేక్ మాలిక్ వశీ భాష రంగస్వామి ఐఎన్టియుసి నాయకులు ఆశీర్వాదం జేమ్స్ ఆనందం ప్రతాప్ మహిళా కాంగ్రెస్ కెవి లక్ష్మి మద్దమ్మ సలోమి మొదలగు వారు పాల్గొన్నారు.