ఈవీఎం ప్యాట్ నమూనా ఓటుపై ఓటర్లకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ప్యాట్ నమూనా ద్వారా ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలనే వాటిపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఎన్నికలు దగ్గరికీ సమీపిస్తున్న తరుణంలో ఇరుపార్టీల నాయకులు బిజీ బిజీగా ఉన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని చౌటుకూరు గ్రామంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ వైసీపీ నాయకులు గ్రామ సర్పంచ్ మదార్ సాహెబ్,సాదిక్,వినోద్ రెడ్డి,బాలి రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికి వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించారు.ఈనెల 13న జరిగే ఎన్నికల్లో దార సుధీర్,పోచా బ్రహ్మానంద రెడ్డికి మీ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు.అంతే కాకుండా గ్రామ టిడిపి నాయకులు గోకారి,నరసింహ గౌడ్,ఎమ్మార్పీఎస్ నేత సామన్న,షబ్బు ఆధ్వర్యంలో ఈవీఎం ఫ్యాట్ ద్వారా ప్రజలకు వివరించారు.49 బన్నూరులో ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు బలరాముడు ఆధ్వర్యంలో పైపాలెంలో గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు ఉపసర్పంచ్ మర్రి రామకృష్ణ ఓటర్లకు అవగాహన కల్పించారు.అన్ని గ్రామాల్లో వైసీపీ టిడిపి నాయకులు ఎటు పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బన్నూరు సర్పంచ్ భూదేవి,సుదర్శన్ రెడ్డి శ్రీనివాసులు సాంబశివుడు షేక్ అహ్మద్ మధు హరీష్ తదితరులు పాల్గొన్నారు.