PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కర్నూలు నగర రూపురేఖలు మార్చి చూపిస్తా.. టిజి భరత్

1 min read

చేనేత కులాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న టీజీ భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎన్నికల్లో తనకు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి చూస్తే కర్నూలు రూపురేఖలను మార్చి చూపిస్తానని కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. కర్నూల్ నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన చేనేత కులాల, వస్త్ర, రెడీమేడ్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ఈనెల 13వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్లో ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే కర్నూలును స్మార్ట్ సిటీగా మార్చి చూపిస్తానని తెలిపారు. కర్నూలు నగరాన్ని ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా తన తండ్రి  టీజీ వెంకటేష్ ఎంతో అభివృద్ధి చేశారని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన కంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని వివరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించి అవసరమైన కృషి చేస్తానని వివరించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా కొనసాగి ఉండి ఉంటే కియా పార్కు, హైకోర్టు కర్నూల్లో ఎప్పుడో వచ్చేవని ఆయన చెప్పారు. కర్నూల్ లో ఎక్కడ చూసినా తమ మార్క్ అభివృద్ధి కనబడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ఈనెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పారు. గత 45 సంవత్సరాలుగా తమ కుటుంబం ప్రజాసేవలో ఉందని.. ఏనాడు ఏ ఒక్కరికి అన్యాయం చేసి ఎరుగమని వివరించారు. అలాంటివారిని ఎన్నికల్లో ఓటు వేసి ఎన్నుకోవాలని, అలా కాకుండా కుల మతాలను చూసి ఓట్లు వేసే ధోరణికి దూరంగా ఉండాలన్నారు. కర్నూలు అభివృద్ధికి సంబంధించి తాను ఆరు గ్యారెంటీలు రూపొందించానని, వాటి అమలు ద్వారా కర్నూలు సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గత పది సంవత్సరాలుగా తాము అధికారంలో లేకున్నా ఏ ఒక్కరోజు కూడా నిరుత్సాహ పడకుండా ప్రజలకు సేవా కార్యక్రమాలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఒక్కరోజు ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాల పాటు వారికి సేవలు అందిస్తానని తెలిపారు. కర్నూలు నగరంలో 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని, ఆ స్థాయిలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో ప్రజలే ఆలోచించాలన్నారు. ఆ 700 కోట్లు ఎవరి జోబులోకి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యజమానుల హక్కులను హరించి వేసే విధంగా ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా క్రయ విక్రయాలకు సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్లను ప్రభుత్వం వద్దనే ఉంచుకొని జిరాక్స్  ను భూ యజమానులకు ఇచ్చే సంప్రదాయాన్ని వైసిపి ప్రభుత్వం తీసుకు వచ్చింది అన్నారు. ఇప్పటికైన ప్రజలు ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించకపోతే రాష్ట్రంలో బానిసలుగా జీవించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాక్షస పాలనను అంతమొందించడానికి టిడిపి బిజెపి జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయని వివరించారు.అనంతరం చేనేత కులాలు, వస్త్ర రెడీమేడ్ వ్యాపారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తమ సామాజిక వర్గాల తరపున టీజీ భరత్ విజయానికి అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. నగరంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఒక టీజీ కుటుంబం వల్లేనని వివరించారు. కులమతాలకు అతీతంగా అందరూ టిడిపి అభ్యర్థి టీజీ భరత్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

About Author