మైనార్టీలకు..4 శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే..
1 min readప్రధాని మోదీ ముందు… ఈ మాట చెప్పే దమ్ము బాబుకు ఉందా…?
- కర్నూలు సిద్ధం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు:రాజకీయ స్వార్థం కోసం…. ముస్లిం మైనార్టీల జీవితాలతో ఆడుకోవడం దారుణమన్నారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వాస్తవానికి అన్ని కులాలు… మతాల్లోనూ బీసీలు ఉంటారని, ఇది గుర్తించని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పిన ఎన్డీఏలో ఎందుకు జత కట్టారో సమాధానం చెప్పాలని ఘాటుగా ప్రశ్నించారు. గురువారం కర్నూలు నగరంలోని ఎస్బీఐ సర్కిల్లో సిద్ధం సభ జరిగింది. సభకు విశిష్ట అతిథిగా విచ్చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలలో 4 శాతం రిజర్వేషన్‌పై మాట్లాడారు. ముస్లింలలోనూ పటాన్‌లకు…. సయ్యద్‌లకు…. మొగల్ లకు రిజర్వేషన్ ఇవ్వడంలేదని, కేవలం మైనార్టీలకు మాత్రమే వర్తిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్ ఉండాల్సిందేనని స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్….. ఈ మాట ప్రధాని మోదీ ముందు చంద్రబాబుకు చెప్పే దమ్ము ఉందా…. అని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాడని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇచ్చే రూ. 2వేలకు మోసపోవద్దని…. మీ జగన్ వస్తే… పథకాలు కొనసాగింపు ఖాయమని పేర్కొన్నారు. సభలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఏంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి ఇంతియాజ్, ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.