ఘనంగా పీవీ రావు జయంతి వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నందికొట్కూరు పట్టణంలోని మాల మహానాడు తాలూకా కార్యాలయంలో తాలూకా మాల మహానాడు అధ్యక్షులు. పబ్బతి శివప్రసాద్ ఆధ్వర్యంలో పివి రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ 1997లో జరుగుతున్న తీరును ప్రశ్నించినందుకు చంద్రబాబు ప్రభుత్వం పీవీ రావును ప్రభుత్వ ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రయత్నించడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి సభలు ధర్నాలతో ఎస్సీ వర్గీకరణ చట్ట విరుద్ధమని రాజ్యాంగ విరుద్ధమని ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించినది కాదని దేశానికి సంబంధించిన రాజకీయ అవసరాల కోసం అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని 2001లో సుప్రీంకోర్టును మాల మహానాడు ఆశ్రయించింది. అంబేద్కర్ భావజాలంతో దళితులంతా ఐక్యంగా ఉండాలని అంబేద్కర్ రాష్ట్రాలలో వివిధ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి కాకుండా అణిచివేతకు గురైన వారికి పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం వైఎస్ కూడా ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపారు.వివిధ పార్టీల నేతలను కలుపుకొని వర్గీకరణకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న సందర్భంలో తీవ్ర గుండెపోటుతో 2005 డిసెంబర్ 22 హఠాత్ మరణం పొందారు భౌతికంగా దూరమైన ప్రాంతాలుగా దళితులు విడిపోయిన రెండు రాష్ట్రాల్లో దళితుల ఐక్యతను కోరుకునే వారందరికీ ఆయన ఆశయ సిద్దులే పోరాటాల రూపంలో ఎప్పుడూ మన అందరి ముందుంటారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నల్లమల్ల పుల్లన్న మధు ల్,పట్టణ ఉపాధ్యక్షులు చెరుకు అజయ్,విల్సన్. ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.