వేసవిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
1 min readవేసవిలో ఉపశమనం కల్గించేందుకు ట్రాఫిక్ పోలీసులకు చలువ అద్దాలు
కూలింగ్ వాటర్ బాటిల్స్, వైట్ హెల్మెట్ లు అందజేసిన…. జిల్లా ఎస్పీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వేసవికాలంలో ఉపశమనం కల్గించేందుకు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది సంక్షేమమే పరమావధి అని, ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బంది పడకూడదని , తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ సూచించారు.ఈ సంధర్బంగా శనివారం కర్నూలు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ట్రాఫిక్ విభాగపు పోలీసులకు చలువ అద్దాలు, కూల్ వాటర్ బాటిల్స్ , వైట్ హెల్మెట్ లను జిల్లా ఎస్పీఅందజేశారు.వేసవిలో రోడ్లపై గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, విధుల్లో ఆటంకం లేకుండా అనువుగా ఉండేందుకు చలువు అద్దాలు, కూల్ వాటర్ బాటిల్స్, వైట్ హెల్మెట్లను అందజేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ గౌతమి మరియు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు.