ప్రశాంతంగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
1 min readఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు, శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గం లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నియోజకవర్గంలో 208350 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 1,02,155, మహిళలు 1,06,172, ట్రాన్స్‌జెండర్ 23 మంది ఓటర్లు ఉన్నారు. ఆరు గంటల వరకు నియోజకవర్గం లో 208350 ఓటర్లు ఉండగా 137050 ఓట్లు పోలయ్యాయి. దీంతో 65. 78 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు, శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు : – సోమవారం జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రాలయం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి కాచాపురం లో, ఉమ్మడి కూటమి అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర రెడ్డి మాధవరం లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు మంత్రాలయం లో సంత మార్కెట్ లో పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి తో పాటు గ్రామ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వృద్దులు, యువకులు, పురుషులు, మహిళలు బారులు తీరారు.
మొరయించిన ఈవియం లు : మంత్రాలయం యంపి పి స్కూల్ పోలింగ్ కేంద్రం లో 70 బూతులో ఉదయం ఈవియం మొరయించడండం తో గంట పాటు పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దీన్ని అధికారులు స్పందించి వేరే ఈవియం మిషన్ ఏర్పాటు చేయడం తో పోలింగ్ ప్రారంభం అయింది. కోద్ది సేపటి తరువాత ఇదే పాఠశాలలో 71 బూతులో ఈవియం మొరయించడండం తో ఇక్కడ అరగంట పాటు పోలింగ్ నిలిపి కొత్త ఈవియం మిషన్ ఏర్పాటు చేసి పోలింగ్ కొనసాగించారు.