ఈ నెల 16 నుంచి 25 వరకు మూడుప్రాంతాల వీహెచ్పీ” శిక్షణా శిబిరం “
1 min readకర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సేవ సురక్ష సంస్కార్ ..అనే ధ్యేయం వాక్యాలను అనుసరిస్తూ పనిచేస్తున్న సామాజిక , ధార్మిక సంస్థ విశ్వ హిందూ పరిషత్ సంస్థా గతంగా పనిచేసే కార్యకర్తలకు సమాజంలో జరిగే హిందువులపై జరిగే అన్ని దాడులనూ, నష్టాలనూ, ఆలయాల ఆస్థుల ఆక్రమణలనూ, అడ్డుకోవడానికి , రక్షించడానికి తగినంత ‘శిక్షణ’ అవసరమని అందుకోసం ఈనెల 16 వతేది గురువారం నుండి 25 వ తేది శనివారం వరకు ఉత్తరాంధ్ర , దక్షిణాంధ్ర, తెలంగాణా ప్రాంతాల నుండి వచ్చే కార్యకర్తలతో రవీంద్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్య దాతృత్వం తో లక్ష్మీపురం వద్ద గల “రిడ్జ్” పాఠశాల నందు 10 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఉదయాన్నే యోగా, ఆటలు, దేశభక్తి గీతాలు , సంస్థయోక్క విధి, విధానాలు, వంటి వాటిలో శిక్షణ ఇస్తారని, కేంద్రీయ , క్షేత్ర, ప్రాంత అధికారులు ఈ శిక్షణా శిబిరంలో మార్గదర్శనం చేస్తారని విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ తెలియజేశారు కర్నూలు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఒక ప్రకటనలో తెలియజేశారు.