సీబీఎస్ఈ పది ఫలితాలలో రిడ్జ్ విద్యార్థుల ప్రతిభ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ పది ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎ.హరి సుహాస్ రెడ్డి(486), జి.జోషిత రెడ్డి (481), ఎం. లిఖిత్ (480), కె.జయంత్ కుమార్ యాదవ్ (474), జె.వి.శ్రీ ప్రణవి(473), ఎం. యశశ్విని(472), మార్కులను కైవసం చేసుకున్నారు. 111 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా వారిలో 14 మంది విద్యార్థులు 90శాతం పైన, 49 మంది విద్యార్థులు 80 శాతం , 73 మంది విద్యార్థులు 70శాతం పైన నిలిచారు. నూటికి నూరు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల సీఈఓ గోపినాథ్ , ప్రిన్సిపల్ రాజేంద్రన్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు. ఇంతటి ఉత్తమ ఫలితాలకు కారకులైన ఉపాధ్యాయ బృందానికి పాఠశాల యాజమాన్యం వారు ప్రత్యేక అభినందనలు తెలిపారు.