ఏలూరు పట్టణంలో రహదారుల ప్యాచ్ వర్క్ పనులు పరిశీలన..
1 min readపనుల్లో వెబ్ నాణ్యతా వుండాలి….జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు పట్టణంలో రహదారులు, భవనాల శాఖ ద్వారా చేపట్టి పూర్తిచేసిన రహదార్ల ప్యాచ్ వర్క్ పనులను ఆర్ అండ్ బి ఎస్ఇ జి. జాన్ మోషే తో కలిసి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు.శుక్రవారం ఏలూరు పట్టణంలో ఆర్ అండ్ బి (యండిఆర్ ) కోటి రూపాయలు నిధులతో మంజూరైన నాలుగు రోడ్లకు పూర్తయిన ప్యాచ్ వర్క్ పనులు లో లింక్ రోడ్డు ఏలూరు-కైకలూరు, చాటుపర్రు, ఈకె రోడ్డు వయా క్లాక్ టవర్ నుండి ఏలూరు టౌన్ వరకు, పాత బస్టాండ్ నుండి గజ్జెలవారి చెరువు వరకు, గూడ్స్ షెడ్ రోడ్డు నుండి రైల్వే స్టేషన్ వివి రోడ్డు వరకు ప్యాచ్ వర్క్ లు పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆర్ అండ్ బి అధికారులతో కలిసి ఏలూరు-కైకలూరు వెళ్లే రోడ్డు, పాత బస్టాండ్ నుండి గజ్జెలవారి చెరువు వరకు వేసిన ప్యాచ్ వర్క్ లను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించి, స్ధానికలను కూడా రోడ్డు పనులపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి డిఇ గోవింద మోహన్, ఇఇ వై.వి. కిషోర్ బాపూజీ, ఎఇ శేషుకుమార్, తదితరులు ఉన్నారు.