పేదలను ఆదుకునేందుకు సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
1 min readపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సమాజంలో పేదలను ఆదుకునే బాధ్యత కేవలం ప్రభుత్వాలకే అన్న ఆలోచనలు వదలివేసి సామాజిక స్పృహతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న శ్రీ గురుదత్త పాలి క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో పేద మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సొంత లాభాన్ని కొంతమనుకొని పొరుగు వారికి సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమాజంలో పేదలను ఆదుకోవడం కేవలం ప్రభుత్వాల బాధ్యత గానే చాలామంది భావిస్తున్నారని కానీ అలా కాకుండా సామాజిక సేవ దృక్పథంతో తమ వంతుగా పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగానే తాను పేదల కోసం తనకున్న పరిధిలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని వివరించారు. సమాజంలో ఎంతోమంది ధనికులు ఉన్నారని, వారంతా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ మానవత సేవా దృక్పథంతో ముందుకు వస్తే సమాజంలో పేదరికం తగ్గించేందుకు అవకాశం ఉందని ఆయన వివరించారు .ప్రస్తుతం సమాజంలో విద్య ,వైద్యం తో పాటు ఎంతోమంది సరైన ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారని అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా ఉన్నవారు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. పేదలందరికీ కూడు , గుడ్డ వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఇందుకోసం ఎన్జీవో సంఘాలు కృషి చేస్తున్నాయని సేవాభావం ఉన్నవాళ్లు అందులో భాగస్వాములు కావలసిన అవసరం ఉందన్నారు. సామాజిక సేవ చేయాలనుకునే వారికి ఎన్జీవో సంఘాలు మంచి వేదికలుగా ఉపయోగపడతాయని సూచించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తన వంతు బాధ్యతగా నిరంతరం ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తూ పేదలకు సేవ చేయడంలో తన వంతు బాధ్యతను నెరవేరుస్తున్నానని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు.