PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇసుక అక్రమ మైనింగ్ చేసే వారిపై క్రిమినల్ కేసులు..

1 min read

జిల్లా కలెక్టర్ వే. ప్రసన్న వెంకటేష్

షెడ్యూల్ ఏరియాలోని ఇసుక రీచ్ ల వద్ద సీసీ కెమెరాలు, సిబ్బందితో నిఘా

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో జిల్లా అధికారులతో విస్తృత తనిఖీలు                                                         

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : కుక్కునూరు, వేలేరుపాడు, జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ వే. ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. వేలేరుపాడు మండలం రుద్రంకోట 1, 2, రీచ్ లు, కుక్కునూరు మండలంలోని దాచారం, వంజరం, ఇబ్రహీంపేట  ఇసుక రీచ్ లను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్  సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ   జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచ్ లలోనే ఇసుక మైనింగ్ చేయాలనీ, అనుమతిలేని ఇసుక రీచ్ లలో త్రవ్వకాలు నేరమన్నారు, ఇసుకని అక్రమ మైనింగ్,  రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.   జిల్లాలోని షెడ్యూల్డ్ ఏరియాలలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని రుద్రంకోట 1,2 రీచ్ లు, దాచారం, వంజరం, ఇబ్రహీంపేట ఇసుక రీచ్ ల వద్ద  ఇసుక అక్రమ మైనింగ్,  రవాణా నిరోధించేందుకు  సిసి టీవీ లు ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం  ప్రత్యేక నిఘా  ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.  జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని  పోలీసు, గనులు,  సెబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.    ఈ సందర్భంగా రుద్రంకోట, ఇబ్రహీంపేట ఇసుక రీచ్ ల వద్ద అక్కడ స్థానిక ప్రజలను ఇసుక అక్రమ మైనింగ్,  రవాణాపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ స్థానికులతో మాట్లాడుతూ  ఇసుక అక్రమ మైనింగ్, రవాణాను ఎట్టి పరిస్థితుల్లోను ఉపేక్షించబోమన్నారు. జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాలలో ప్రతీ ఇసుక రీచ్ వద్ద 24 గంటలూ పనిచేసే విధంగా సీసీ కెమెరాలు, సిబ్బందితో నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, ఇసుక అక్రమ మైనింగ్, రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.    ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా పెట్టడం జరిగిందని అయినప్పటికీ ఎక్కడైనా ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లయితే వెంటనే స్థానికులు దగ్గరలోని రెవిన్యూ, పోలీసు లేదా గ్రామ వి ఆర్ ఓ లకు  సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గొప్యంగా ఉంచడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు.   జిల్లా కలెక్టర్ వెంట ఎస్పీ డి.మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ ఎన్. సూర్యచందర్రావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కే అద్దయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఆర్ బ్ల్యూఎస్ ఎస్.ఈ సత్యనారాయణ, గనుల శాఖ డిడి బి. రవికుమార్, భూగర్భ జల శాఖ డిడి విజయ్ కుమార్, రెవిన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author