దళిత కాలనీల్లో హిందూ వైద్యులు ఉచిత “వైద్యసేవ” లందించాలి
1 min readవిశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త మహా మంత్రి స్థాణుమాలయన్ …..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ 20/5/24, సోమ వారం సా: గం.లకు మాడ్రన్ ఐ హాస్పిటల్స్ & రీసెర్చ్ సెంటర్, గాయత్రి ఎస్టేట్ , కర్నూలు నందు ఏర్పాటు”హిందూ వైద్య బంధువుల సమావేశం” లో కేంద్రీయ సంయుక్త మహామంత్రి స్థాణుమాలయన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎవ్వరికైనా ప్రాణం పోయగల సమర్థత కలిగిన ఏకైక “సేవా వృత్తి” వైద్యం మాత్రమే అటువంటి వైద్యవృత్తిలో ఉన్న మీరందరూ దేవుళ్ళు తో సమానమని అందుకే “వైద్యోనారియణో హరిః ” అని అంటారని తెలియజేశారు ఈనాడు వైద్యం చాలా ఖరీదైన వ్యవహారం అయ్యిందనీ…దీనికోసం పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారనీ అటువంటి పేదలు, దీన దళితులు నివశించేచోట్ల కనీసం నెలకు ఒకసారైనా “ఉచిత వైద్య శిబిరాలు” నిర్వహించాలని సరైన వైద్యాన్ని అందించడంతో పాటు ఉచితంగా మందులు అందజేయాలని తద్వారా హిందూ వైద్యులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని “ఉచిత వైద్య సేవ” అందించాలనీ పిలుపునిచ్చారు.విశ్వ హిందూ పరిషత్ గురించి మాట్లాడుతూ సేవ, సురక్ష, సంస్కిర్, అనే ధ్యేయం వాక్యాలు అనుసరించి విశ్వ హిందూ పరిషత్ పనిచేసే సామాజిక , ధార్మిక సంస్థ అనీ, పరిషత్ లో చాలా విభాగాలు పనిచేస్తున్నాయనీ యువకుల కోసం బజరంగ్దళ్, యువతుల కోసం దుర్గావాహిని, మాతృ మూర్తుల కోసం మాతృశక్తి , సేవా,మతమార్పిడులు ఆపడం కోసం ధర్మప్రసార్, సామాజిక అసమానతలను తొలగించడానికి సామాజిక సమరసత, గోరక్ష – గోసంవర్ధనం , వంటి 16 విభాగాలు పనిచేస్తున్నాయనీ ఈ విభాగాల్లో పనిచేసే కార్యకర్తలదరూ దేశం కోసం, ధర్మం కోసం ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, సహకార్యదర్శి ప్రాణేష్,కోశాధికారి సందడి మహేశ్వర్,జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, మాడ్రన్ ఐ హాస్పిటల్స్ అధినేత రాజశేఖర్, ఆర్.యస్.యస్.కర్నూలు నగర సంఘచాలక్ (అధ్యక్షులు) వాసు రెడ్డి, వి.హెచ్.పీ. జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్, సహ కార్యదర్శులు గోవిందరాజులు, గూడూరు గిరిబాబు, కోశాధికారి అయోధ్య శ్రీనివాసులు ప్రఖంఢ సహకార్యదర్శి ఉపేంద్ర నాయక్,తదితరులు పాల్గొన్నారు.