PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భారీ వర్షాలతో  పెన్నా నదికి జలకల

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : పెన్నా నది .కుందు నది. ఎగువ ప్రాంతంలో నంద్యాల జిల్లా కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తారు భారీ వర్షాలు కురవడంతో కుందు నది నుంచి పెన్నా నదిలోకి వర్షపు నీరు చేరుతున్నది. పెన్నా నది ఎగువ ప్రాంతంలో ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల కమలాపురం ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పెన్నా నదిలోకి వర్షం నీరు పరుగులు పెడుతున్నాది. వల్లూరు మండలం అది నిమ్మయపల్లి వద్ద పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్ట వద్ద నీటి కల సంచరించుకుంది. ఆనకట్ట నుంచి పెన్నా నదిలో కి నీరు చేరుతున్నది అక్కడ నుంచి చెన్నూరుకు నీరు నెమ్మదిగా కొనసాగుతున్నది. పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి అక్కడ నీరు నిలిచిపోవడంతో నీటి ప్రవాహం తక్కువగా కొనసాగుతున్నది. చెన్నూరు కొండపేట పెన్నా నది వంతెన వద్దకు నీ టిప్రవాహం కొనసాగుతున్నాది. పెన్నా నదికి నేటి ప్రవాహం కొనసాగుతుండడంతో చెన్నూరు కొండపేట కుక్కరాయపల్లి బలిసింగాయపల్లి కనపర్తి ఓబులంపల్లి రామనపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో బోర్లలో అలాగే రైతుల వ్యవసాయంలో నీరు పెరుగేందుకు ఆస్కారం ఉందని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత జనవరి 20వ తేదీన చుక్కలేని పెన్నా నదిలో నీరు నాలుగు నెలలకు పెన్నా నదిలో నేటి ప్రవాహం కనిపించింది దీని కారణంగా పెన్నా నది పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలకు ఊరటనిచ్చింది.

About Author