PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కె క్యు బ్యూటీ స్టూడియో  ప్రారంభోత్సవం

1 min read

ప్రారంభోత్సవం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త  మడుపల్లి రత్నాకర్..

కేశ అలంకరణ, సౌందర్యం అలంకరణ కోసం విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు ఇక స్వస్తి పలకండి

ఇంటర్నేషనల్ కంపెనీ, సినీ పరిశ్రమ అనుభవంతో సేవలు

స్టూడియో అధినేత చెల్లూరి రుద్రరాజు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : స్థానిక పతే బాధ మూడు గుళ్ళు సెంటర్, స్వీట్ మ్యాజిక్ ఎదురుగా సోమవారం కె క్యు హెయిర్ డ్రెస్సెస్ స్టూడియోను ఫోర్త్ ఫ్లోర్ లో ప్రముఖ వ్యాపారవేత్త మడుపల్లి రత్నాకర్ చేతుల మీదగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్టూడియో వ్యవస్థాపక అధినేత చెల్లూరి రుద్ర రాజు మాట్లాడుతూ స్కిన్, నైల్ పాలిష్, మెహందీ, సెల్యూన్, హెయిర్ మేకప్, బ్యూటీ మేకప్, లేజర్ వర్క్ తదితర సేవలో అందుబాటులో ఉన్నాయన్నారు. జెంట్స్ కి, లేడీస్ కి, కిడ్స్ కి వేరువేరు సెంట్రల్ ఏసీ హాల్స్ లో ప్రత్యేకంగా అలంకరిస్తారన్నరు. సుమారు 25 సంవత్సరాల అనుభవంతో హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలలో ప్రముఖ మేకప్ కంపెనీలో మరియు సినీ ఇండస్ట్రీలో మేకప్ అసిస్టెంట్ ఆర్టిస్టుగా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. మేకప్ ఆర్టిస్టుగా ఇంటర్నేషనల్ కంపెనీలలో ప్రావీణ్యం పొందానని తెలిపారు. మా వద్ద  ఇంటర్నేషనల్ గా అనుభవం పొందిన వారిచే సర్వీసులో అందించబడతాయన్నారు. మా కె క్యు స్టూడియోలో  విశాలమైన ఆహ్లాదకరమైన వాతావరణం సేద తీరవచ్చన్నారు. విజయవాడ, హైదరాబాదు వంటి నగరాలకు యువతీ యువకులు, పిల్లలు మేకప్, హెయిర్ డ్రెస్సెస్ తదితర అవసరాలకు వెళ్ళవలసిన అవసరం ఇకమీదట ఉండదని మన ఏలూరు మహానగరంలో కె క్యు హైయర్ డ్రెస్సెస్ అందుబాటులో ఉందని తెలిపారు. ఒకసారి విచ్చేసి మీ అంద సౌందర్యాలను అలంకరించుకొని. మా వ్యాపార అభివృద్ధికి సహకరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నగరంలోని ప్రముఖ ఉద్యోగ,వ్యాపారవేత్తలు, స్నేహితులు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు విచ్చేసి ఆశీర్వదించి మరింత వ్యాపార అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

About Author