వైభవంగా విజయ దుర్గ దేవి జాతర మహోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని మాధవరం రచ్చమరి గ్రామాల మద్య వెలసిన శ్రీ విజయ దుర్గ దేవి (మారెమ్మ అవ్వ) జాతర మహోత్సవం ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఈ సందర్భంగా ఉదయం నుండి వివిధ రకాల పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మ వారి ప్రభావళిని భక్తుల హర్షధ్వనుల మద్య భాజభజంత్రీల మద్య నిర్వహించారు. ముందుగా రచ్చమరి గ్రామం నుంచి మహిళలు, యువతులు కలశములతో, కుంభాలతో గ్రామ సమీపంలో ఉన్న మారెమ్మ అవ్వ దేవాలయం వరకు ఊరేగింపు వచ్చి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతర ను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మ వారిని దర్శించుకున్న శ్రీనివాస్ రెడ్డి :- జాతర సందర్భంగా అమ్మ వారిని టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాధవరం ఎస్సై కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో ఏఎస్ ఐ బందేనవాజ్, కానిస్టేబుళ్లు రామకృష్ణ, వీరేష్, మోహన్ లతో బందోబస్తు నిర్వహించారు. ఉచిత అన్నదాన ఏర్పాటు : జాతర సందర్భంగా వచ్చిన భక్తులకు ఉచిత అన్నదాన ఏర్పాటు చేశారు.