ఏపీ ఇపీ డి సి ఎల్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం
1 min readజిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి
ప్రతిరోజు150 లీటర్ల పైగా మజ్జిగ పంపిణీ చేస్తున్నం
ఎస్ఇ పి.సాల్మన్ రాజు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి తెలిపారు. శుక్రవారం స్థానిక రామచంద్రరావు పేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి గుడివద్ద తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులచే ఏర్పాటుచేబడిన ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రం లో ప్రజలకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండల ఉష్ణోగ్రతలు వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ చలివేంద్ర ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్న తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఎండవేడికి బాటసారులకు ఎండతీవ్రతనుండి కాపాడుకోవడానికి మజ్జిగ ద్రావణం ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని గమనించిన విద్యుత్ సంస్ధ ఉద్యోగులు ముందుకు వచ్చి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటుచేసి ప్రజలకు ఎంతోమేలు చేస్తున్నారని తెలిపారు. ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు మాట్లాడుతూ ఏప్రిల్, 14వ తేదీ నుండి రోజుకి 150 లీటర్ల పైగా విజయ డైరీ ద్వారా మజ్జిగ కొనుగోలు చేసి, ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏలూరు సర్కిల్ విద్యుత్ ఇఇ యం. ఝాన్సీ, ఆపరేషన్ ఇఇ జెపిబి నటరాజన్, ఎపిఇపిడిసిఎల్ జనరల్ సెక్రటరీ ఎస్సీ, ఎస్టీ అసోషియేషన్ సిహెచ్ సాయిబాబు, ఎస్సీ, ఎస్టీ రీజనల్ ప్రెసిడెంట్ జి.ఎ.వి. పాల్, ఎస్. బలుసుబాబు, యం. రమేష్, పి. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.