PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీపీఎస్సీ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండ నిర్వహించాలి

1 min read

డిఆర్ఓ కె మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు :  జిల్లాలో ఏపీపీఎస్సీ వారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్  ఉద్యోగాల భర్తీ కోరకు నిర్వహించె పరీక్షలలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండ నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మధుసూదన్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ లో  జిల్లాలో ఏపీపీఎస్సీ వారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్  ఉద్యోగాల భర్తీ కొరకు రేపు 25-05-24 తేదీ నిర్వహించె  ఎగ్జామినేషన్స్  కు సంబంధించి సంబంధిత అధికారులతో  డిఆర్ఓ  కె మధుసూదన్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.డిఆర్ఓ మాట్లాడుతూ ఏపీపీఎస్సీ వారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్  ఉద్యోగాల భర్తీ కోరకు శనివారం 25-05-24 తేదీన నిర్వహించె పరీక్షలలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని 8 కేంద్రాలలో 2230 మంది ఎగ్జామినేషన్ వ్రాయునున్నారు అని అన్నారు. ఈ ఎగ్జామినేషన్స్ ఉదయం 9 గంటల నుండి 11.30 గంటల వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, ఎగ్జామినేషన్స్ కు హాజరయ్యేవారు ఉదయం 8.30 గంటల సమయానికె ఎగ్జామినేషన్ సెంటర్స్ కు చేరుకోవాలని అన్నారు. ఎగ్జామినేషన్స్ కు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ఐడి ప్రూఫ్ కూడా తీసుకురావాలన్నారు. ఎగ్జామినేషన్స్ సెంటర్లలోనికి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబడవని అన్నారు. ఎగ్జామినేషన్స్ నిర్వహించే సమయంలో పోలీస్ శాఖ వారు ఎగ్జామినేషన్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలయేలా చూడాలని, విద్యుత్ శాఖ వారు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, తహసిల్దార్లు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ కు అనుమతులు ఇవ్వాలని, ఆర్టీసీ వారు సమయానుకూలంగా బస్సులను నడపాలని, కాలేజీల యాజమాన్యాలు ఎగ్జామినేషన్ సెంటర్ల లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ఎగ్జామినేషన్ జరగడానికి సహకరించాలన్నారు.ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ ఆర్ వెంకటరమణ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనిల్ కుమార్, ఏపీ ఎస్పీడీసీఎల్  ఈ ఈ ఓబులేషు, పోలీస్ శాఖ, ఆర్టీసీ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author