ఇతరుల మాటలు నమ్మొద్దు..జీవితాలను నాశనం చేసుకోవద్దు:సీఐ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: వచ్చేనెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉందని ఆ రోజున వెలువడే ఫలితాల్లో ఎలాంటి సంబరాలు టపాకాయలు కాల్చడం విజయోత్సవ ర్యాలీ చేపట్టడం వంటివి అనుమతి లేదని ఎవరైనా సరే ఇలాంటివి గ్రామాల్లో చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని నందికొట్కూరు రూరల్ సీఐ విజయభాస్కర్ అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని సుంకేసుల గ్రామంలో శుక్రవారం సాయంత్రం మిడుతూరు ఎస్ఐ జగన్ మోహన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ముందుగా గ్రామంలో పుర వీధుల్లో 15 మంది పోలీసులు కవాతు నిర్వహించారు.తర్వాత గొడవల వల్ల జరిగిన నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.చిన్న చిన్న విషయాలకు పెద్దగా చేసుకొని ఒకరినొకరు కొట్టుకోవడం వల్ల మీపై కేసులు నమోదు కావడం వల్ల మీ జీవితాలు నాశనం అవుతాయని ఎవరైనా సరే గొడవలను ప్రోత్సహిస్తే అలాంటి మాటలు మీరు నమ్మవద్దని మీ జీవితాల గురించి మీ పిల్లల చదువు భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలని సీఐ మరియు మిడుతూరు ఎస్సై జగన్మోహన్ ప్రజలకు వివరించారు. వివాదాలకు దూరంగా ఉంటూ శాంతియుతంగా ఉండాలని రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పట్ల నిఘా ఉంచామని జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ముచ్చుమర్రి ఎస్సై జయ శేఖర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.