రాఘవేంద్రుని సన్నిధి లో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు అన్నామలై శనివారం వచ్చారు. వీరి కి శ్రీమఠం అధికారులు స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట తమిళనాడు బిజెపి నాయకులు, మఠం అధికారులు ఉన్నారు.