వైభవంగా మోక్ష నారాయణుడు బ్రహ్మోత్సవాలు
1 min readరామాపురానికి భారీగా తరలివచ్చిన భక్తజనం
గరుడ వాహనం,మయూర వాహనాలపై దేవతామూర్తులు
అలరించిన సంగీతం, నృత్య ప్రదర్శన
పల్లెవెలుగు వెబ్ కమలాపురం: కమలాపురం మండలం రామాపురం పుణ్యక్షేత్రంలో వెలసిన మహాలక్ష్మి సమేత మోక్షనారాయణ, పల్లీ దేవసేన సమేతఖమణ్య స్వామి బ్రహ్మా త్సవాలు వైభవంగా బ్రహ్మోత్సవాలను ఘనాపాటి వంశీ క్రిష్ణ శర్మఅధ్వర్యంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం చివరి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. మండప అర్చనలు, సర్ప సూక్త పారాయణం, సమస్త దేవతామూర్తుల హోమాలు, మహాపూర్ణహంతి, కుంభాబిషేకం చక్రస్నానం, మహా నైవేద్యం, మంగళహారతి మంత్రపుష్పం పూజా కార్య క్రమాలు కన్నులపండుగగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మోక్ష నారాయణస్వామి దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మహిళలు తీర్థ ప్రసాదాలను పండితులు అందజేశారు. ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. సాయంత్రం మహాలక్ష్మి సమేత మోక్షనారాయణుడు గరుడవాహరం, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామిలను మయూర వాహనల పై మాడ వీధులలో ఊరేగించించారు. దేవతామూర్తులను కనుల విందుగా భక్తులు తిలకించారు.అలరించిన సంగీతం, నృత్య ప్రదర్శన: – బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాత్రి 8 గంటలకు డాన్స్ బేబీ డాన్స్ సంగీత కళాకారులు ఆలపించిన సినీ పాటలు, నృత్య ప్రదర్శన ప్రజలను ఆకట్టుకున్నాయి .