నేటి బాలలే రేపటి పౌరులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఈ రోజు25-05-2024 న అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం సందర్భంగా న్యాయ సేవ సదన్ నందు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్, రెవెన్యూ, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు మొదలైన సంభందిత శాఖలతో అవగాహన కార్యక్రమమును నిర్వహించి, బాలల హక్కులు మరియు బాలల హక్కులను పరిరక్షించడంలో సొసైటీ బాధ్యత గురించి, మెరుగైన సహకారాన్ని అందించడానికి వాటికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. డిపార్ట్‌మెంట్ల మధ్య కోఆర్డినేషన్ మరియు తప్పిపోయిన పిల్లలను గుర్తించడం మరియు వారిని తిరిగి కుటుంబంతో కలపడం, వారి కదలికలపై శ్రద్ద చూపడం తదితర విషయాలని గురించి చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పిల్లల హక్కులు మరియు అట్టడుగున ఉన్నవారు అటువంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని, నేటి బాలలే రేపటి పౌరులు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సి.సాంబశివుడు, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ యస్. మనోహరు, తదితరులు పాల్గొన్నారు.