PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఆర్క్​’లో… అరుదైన సర్జరీ..

1 min read

కోత లేకుండా… బరువు తగ్గవచ్చు…

  • ఎండో స్కోపి ద్వారా మెరుగైన చికిత్స..
  • ఇన్ ట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్ మెంట్​ సర్జరీ సక్సెస్​..
  • ఆర్క్​ హాస్పిటల్​ గ్యాస్ట్రో ఎంట్రాలజీర వైద్యులు డా రితేష్​ రెడ్డి వెల్లడి

కర్నూలు, పల్లెవెలుగు:  సమాజంలో బరురవు తగ్గడానికి నానా తంటాలు పడుతున్న  సమయంలో.. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి.. సులభంగా వెయిట్​ లారస్​ చేయవచ్చని స్పష్టం చేశారు ఆర్క్​ హాస్పిటల్​ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్​ డా. రితేష్​ రెడ్డి. కోతలు లేకుండా… ఎండోస్కోపి ద్వారరా మెరుగైన చికిత్స చేసి…సత్ఫలితాలు పొందవచ్చని వెల్లడించారు.  శనివారం కర్నూలు నగరంలోని ఆర్క్​ హాస్పిటల్​లో రఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్క్​ హాస్పిటల్​ మేనేజర్​ శ్రీనివాసు తాంబేతో కలిసి ఆయన మాట్లాడారు. ఉమ్మడి రకర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన హరిప్రసాద్​ రెడ్డి (51) అధిక బరువు (120 ప్లస్​) ఉండటంతో చాలా అవస్థలు రఎదుర్కొన్నాడని, బరువు తగ్గించాలని ఆర్క్​ హాస్పిటల్​ కు రావడంతో ఆయనకు ఇన్​ ట్రా గ్యాస్ర్టిక్​ బెలూన్​ ప్లేస్​మెంట్​ సర్జరీనిర విజయవంతంగా పూర్తి చేసినట్లు డా. రితేష్​ రెడ్డి తెలిపారు. ఆధునిక టెక్నాలజీతో నూతన ప్రక్కియ ద్వారా నెల రోజుల్లో పదిర కేజీలు, మూడు నెలల్లో 30 కేజీలు తగ్గుతారని వివరించారు.

ఖర్చు తక్కువ….ఫలితం ఎక్కువ…

కర్నూలు నగరంలో గాయత్రి హాస్పిటల్​లోని ఆర్క్​ హాస్పిటల్​లో ఇన్ ట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్ మెంట్ సర్జరీతో … కడుపులో 500 ఎంఎం బెలూన్​ ను పెట్టామని, ఏడాదిపాటు పేషెంట్​ హరిప్రసాద్​ రెడ్డి కడుపులోనే ఉంటుందన్నారు. ఆ తరువాత ఎండో స్కోపి ద్వారా బెలూన్​ను తొలగిస్తామని, దీంతో బరువు బాగా తగ్గే అవకాశం ఉంటుందని గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్​ డా. రితేష్​ రెడ్డి పేర్కొన్నారు.  హైదరాబాద్​ , బెంగుళూరులో ఈ చికిత్సకు దాదాపు 6 నుంచి రూ.7లక్షలు దాకా ఖర్చు అవుతుందని, కానీ ఆర్క్​ హాస్పిటల్​లో రూ.2.5 నుంచి రూ.3 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ఆర్క్​ హాస్పిటల్​ సీఈఓ శశిధర్​ రెడ్డి, డా. త్రినాథ్​, మేనేజర్​ శ్రీనివాసులు తాంబే, గంగాధర్​ రెడ్డి, ఆపరేషన్​ సిబ్బందికి ఈ సందర్భంగా గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్​ డా. రితేష్​ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

About Author